బికినీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా రత్తాలు పేరు ముందు వరుసలో ఉంటుంది. రత్తాలు బికినీ సొగసులకు ఇంత క్రేజ్ వచ్చింది బాలీవుడ్ డెబ్యూ మూవీ 'జూలీ 2'నే అని చెప్పక తప్పదు. సినిమా రిజల్ట్ రివర్స్ గేర్ వేసినా, బికినీ పాపగా లక్ష్మీరాయ్‌కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు, అప్పటి నుండీ, ఇప్పటి వరకూ లక్ష్మీరాయ్ బికినీ సొగసులు కుర్రోళ్లని బేజారెత్తిస్తూనే ఉన్నాయ్.
అంతేకాదు, అక్కడ దెబ్బ తిన్నా, ఆ తర్వాత సౌత్‌లో వరుస అవకాశాలతో లక్ష్మీరాయ్ పరుగులు పెడుతూనే ఉంది. త్వరలో 'నాగకన్య' సినిమాతో ఇచ్ఛాధారి నాగినిగా రాబోతోంది. అంతకన్నా ముందే పోలీసాఫీసర్ గెటప్‌లో కనువిందు చేయనుంది ఇంకో సినిమాతో. ఇవే కాక ఇప్పుడు లక్ష్మీరాయ్ చేతిలో చాలానే సినిమాలున్నాయి.
సినిమాల దారి సినిమాలదే. సోషల్ మీడియా దారి సోషల్ మీడియాదే. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా ఫాలోవర్స్‌ని శాటిస్ఫై చేయడం అస్సలు మర్చిపోదు లక్ష్మీరాయ్. అందుకే తాజాగా అమ్మడు ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ పిక్ ఇప్పుడు వైరల్‌గా మారింది. బ్లాక్ అండ్ వైట్ కలరింగ్‌లో రత్తాలు టూ పీస్ బికినీ సొగసులు చూపు తిప్పుకోనీయకుండా చేసేస్తున్నాయి. చేస్తున్న పనులాపేసి, ఇటేపు ఓ సూపేస్కోండి మరి.!