'వెంకటలక్ష్మీ' కిక్కు ఎలా ఎక్కిందంటే.!

మరిన్ని వార్తలు

ఈ వారం పెద్ద సినిమాలేం విడుదలకు లేవు కానీ, చిన్న సినిమాలు మాత్రం చాలానే ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగ్గ సినిమాగా 'వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మి' పేరును ప్రస్థావించుకోవాలి. లక్ష్మీరాయ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌ని ఎంత మేర ఆకట్టుకుంది అంటే.. గ్లామర్‌ పరంగా లక్ష్మీరాయ్‌ నూటికి నూరు మార్కులూ వేయించుకుందనే రిపోర్ట్స్‌ వస్తున్నాయి. కానీ సినిమాలో పెద్దగా విషయం లేకపోవడంతో వెంకటలక్ష్మి గ్లామర్‌కి విలువ లేకుండా పోయిందంటున్నారు. అయితే తనకున్న క్రేజ్‌తో ఈ వీకెండ్‌ వసూళ్లు బాగానే ఉంటాయని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. 

 

హారర్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో లక్ష్మీరాయ్‌ గ్లామర్‌తో పాటు, రామ్‌ కార్తీక్‌, పూజిత పొన్నాడ మధ్య ఘాటు రొమాన్స్‌ కూడా ఉండడంతో కొంతవరకూ మాస్‌ ఆడియన్స్‌ ఎట్రాక్ట్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఓపెనింగ్స్‌ అంతంత మాత్రంగానే ఉన్నా, వీకెండ్‌ రెండ్రోజులు వసూళ్లు ఓకే అనిపిస్తాయంటున్నారు. ఇక ఇతర ప్రధాన పాత్రధారులైన ప్రవీణ్‌, మధునందన్‌ కామెడీ ఈ వీకెండ్‌లో సినిమాని నిలబెట్టేందుకు ఒకింత ఉపయోగపడ్తుందనడంలో సందేహం లేదు. కిషోర్‌ కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS