'చిత్రలహరి'తో 'కామ్రేడ్‌' మైత్రీ.!

మరిన్ని వార్తలు

'హలో'తో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కళ్యాణీ ప్రియదర్శిన్‌ పుట్టినరోజు ఈ రోజు. ఇదే రోజు రష్మికా మండన్నా బర్త్‌డే కూడా. ఈ ఇద్దరు బర్త్‌డే బేబీలు ఒకే బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నారిప్పుడు. అదే మైత్రీ మూవీ మేకర్స్‌. ఈ బ్యానర్‌ తరపున ఈ ఇద్దరు బర్త్‌డే బేబీస్‌కి స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ అందించింది మైత్రీ మూవీ సంస్థ. 

 

రష్మికా నటిస్తోన్న 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రానికి భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ బ్యానర్‌ నిర్మిస్తోంది. విజయ్‌ దేవరకొండ హీరో అన్న సంగతి తెలిసిందే. మే లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కళ్యాణీ ప్రియదర్శిన్‌ నటిస్తున్న 'చిత్రలహరి'ని కిషోర్‌ తిరుమల తెరకెక్కిస్తుండగా, మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో రూపొందుతోంది. సాయి ధరమ్‌తేజ్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

లేటెస్ట్‌గా విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. కళ్యాణీతో పాటు నివేదా పేతురాజ్‌ ఈ సినిమాలో మరో కథానాయికగా నటిస్తోంది. కళ్యాణీ చాలా ముద్దుగా అందంగా ఎక్స్‌ప్రెసివ్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది ఈ సినిమా పోస్టర్స్‌లో. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కళ్యాణీకి మనం కూడా బర్త్‌డే విషెస్‌ చెప్పేద్దామా. విష్‌ యు హ్యాపీ బర్త్‌డే టు కళ్యాణీ ప్రియదర్శిన్‌. అన్నట్లు ఈ బ్యూటీ యంగ్‌ హీరో శర్వానంద్‌తోనూ ఓ సినిమాలో నటిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS