బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకొంది. ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాత్సవ ఈరోజు ఉదయం కన్ను మూశారు. ఆయన వయసు 58 ఏళ్లు. గత కొంతకాలంగా ఆయన మృత్యువుతో పోరాడుతున్నారు. గత నెల 10న ఆయనకు గుండె పోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 41 రోజులుగా ఆయన ఐసీయూలోనే చికిత్స తీసుకుంటున్నారు. ప్రాణాలతో పోరాడుతూ... ఈరోజు తుది శ్వాస విడిచారు.
స్టాండప్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకొన్న రాజు... ఆ తరవాత సినిమాల్లోకి ప్రవేశించారు. మైనే ప్యార్ కియా, బిగ్ బ్రదర్, బాంబే టూ గోవా, మిస్టర్ ఆజాద్ లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని నవ్వించారు. బిగ్ బాస్ - 3 (హిందీ)లోనూ పాల్గొన్నారు. శ్రీవాత్సవ మరణం టాలీవుడ్ ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు.