సింహా, లెజెండ్‌... అంత‌కు మించి..!

By iQlikMovies - December 22, 2018 - 10:36 AM IST

మరిన్ని వార్తలు

సింహాలో నంద‌మూరి బాల‌కృష్ణ‌ని ఓ రేంజ్‌లో చూపించాడు బోయ‌పాటి శ్రీ‌ను. అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న బాల‌య్య ఒక ఎత్తు.. సింహాలోని బాల‌య్య మ‌రో ఎత్తు అని అభిమానులు పొంగిపోయారు. లెజెండ్‌లో కూడా అంతే. మునుపెన్న‌డూ చూడ‌ని బాల‌య్య క‌నిపించేస‌రికి... ఫ్యాన్స్‌పండ‌గ చేసుకున్నారు.

 

ఈ రెండు చిత్రాలూ బాల‌య్య కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిపోతాయి. ఇప్పుడు వీరి కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా రాబోతోంది. శుక్ర‌వారం జ‌రిగిన `ఎన్టీఆర్` పాట‌ల వేడుక‌లో ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది.  ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమాని ప‌ట్టాలెక్కిస్తారు. ఎన్ బీ కే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. బాల‌కృష్ణ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు.

 

ఈ సినిమా గురించి బోయ‌పాటి శ్రీ‌ను మాట్లాడుతూ ''రాయ‌డం తీయ‌డం మాత్ర‌మే నాకు తెలుసు. ప్ర‌తీ సినిమా మొద‌టి సినిమాగానే క‌ష్ట‌ప‌డతాను. ఫిబ్ర‌వ‌రిలో బాల‌య్య‌తో చిత్రం ముహూర్తం జ‌రుపుకుంటుంది. రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడ‌న్న‌ది త‌ర‌వాత చెబుతాంత‌. సింహా, లెజెండ్‌ల‌కు మించి ఈ సినిమా ఉండ‌బోతోంది'' అని అభిమానుల్ని అల‌రించారు బోయ‌పాటి శ్రీ‌ను.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS