సినీ పరిశ్రమలో ఎవరూ గాసిప్స్‌కి అతీతం కాదు. అయితే, పదేళ్ళకు పైగా కెరీర్ వున్న అందాల చందమామ కాజల్ అగర్వాల్ మాత్రం, గాసిప్స్‌కి చాలా చాలా దూరం. ఆమె చుట్టూ ఎలాంటి గాసిప్స్ రాలేదు ఇప్పటిదాకా. ఎప్పుడూ ఏ వివాదం జోలికీ కాజల్ వెళ్ళలేదు. చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరించింది. అందుకే, సోషల్ మీడియా వేదికగా ఆమెకు బోల్డంతమంది ఫాలోవర్స్ వున్నారు. కాజల్‌కి వున్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. 'కాజు పాపా' అంటూ ఆమెను ముద్దుగా పిలుచుకుంటుంటారు అభిమానులు.
అయితే, 'క్వీన్' రీమేక్ 'ప్యారిస్ ప్యారిస్' కాజల్‌ని వివాదంలోకి లాగేసింది. కారణం, ఆ సినిమాలో కాజల్ అసభ్యకర ప్రవర్తనే. ఇంకో నటి, కాజల్ వక్షోభాగాన్ని తాకుతూ.. అసభ్యకరంగా వ్యవహరిస్తుంది ఆ సన్నివేశంలో. ఆమె అలా చేస్తోంటే కాజల్ ఇబ్బందికరంగా ఫీలవుతుంది.. అదీ ఆ సన్నివేశం. కాజల్ లాంటి పేరున్న నటి ఇలాంటి 'చీప్' సన్నివేశంలో నటించడం పట్ల ఆమె అభిమానులు దారుణంగా హర్ట్ అయ్యారు. ఆ విషయాన్ని కాజల్‌కే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.
కానీ, కాజల్ తన అభిమానుల ఆవేదనను పట్టించుకోలేదు. ట్రాలింగ్‌ని అసలే లెక్క చేయలేదు. ట్రైలర్‌ని మెచ్చుకున్నందుకు థ్యాంక్స్ చెబుతూ, ఓ ఫొటోని విడుదల చేసింది. 'లవ్' సింబల్‌ని చూపిస్తూ వుంది ఆ ఫొటో. సౌత్‌లో బిజీయెస్ట్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఖచ్చితంగా కాజల్ అగర్వాల్ పేరుంటుంది. అలాంటి కాజల్, ఎందుకిలా చేసింది.? మొత్తం నాలుగు రీమేక్స్ తాలూకు టీజర్స్ (క్వీన్ రీమేక్స్) ఒకే రోజు విడుదల కాగా, ఏ టీజర్‌లోనూ ఇలాంటి సన్నివేశం లేదు.