2019 సంక్రాంతికి 'వినయ విధేయ రాముడు'గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. ఈ సినిమాకి బోయపాటి శీను దర్శకుడు. డివివి దానయ్య నిర్మాత. చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీపావళికి ముందు 'వినయ విధేయ రామ' టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు.
ఫస్ట్‌లుక్‌లో చరణ్ మొహాన్ని పూర్తిగా కనబడనీయకుండా చేసేస్తారు. ఏదో ఆయుధం చరణ్ మొహాన్ని సగం వరకూ కప్పేసింది. అప్పట్లోనే మెగా ఫ్యాన్స్ బాగా హర్టయ్యారు. ఎందుకిలా చేశావ్ బోయపాటి..? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. లేటెస్టుగా ఇంకో స్టిల్ వచ్చింది. ఈ స్టిల్‌లో హీరోయిన్ కైరా అద్వానీ బ్రైట్‌గా కనిపిస్తుంటే, చరణ్ ఫేస్ మాత్రం పూర్తిగా కనబడనీయలేదు. ఏదో స్టైల్ అనుకున్నారేమో ఈ ఫోటోలో చరణ్ పైకెక్కడో చూస్తున్నాడు.
మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు బోయపాటి. మాస్‌లో చరణ్‌కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కానీ ఆ మాస్‌ని నిరాశపరిచేలా ఇలాంటి స్టిల్స్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారో ఏమో. తాజా స్టిల్‌తో మరోసారి బోయపాటి విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనికి పూర్తి బాధ్యత బోయపాటిదే అనలేం కానీ, కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా ఆడియన్స్ దృష్టి ఆటోమెటిగ్గా బోయపాటి మీదకే వెళుతుంది మరి.