మహేష్‌ బాకీ తీర్చేస్తానంటున్న సుకుమార్‌.!

By iQlikMovies - December 20, 2018 - 10:40 AM IST

మరిన్ని వార్తలు

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు - విలక్షణ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో '1 - నేనొక్కడినే' చిత్రం తెరకెక్కింది. కానీ క్రిటికల్‌ స్క్రీన్‌ప్లేతో కన్‌ఫ్యూజ్‌ చేశాడనే టాక్‌తో ఆ సినిమా ఆశించిన రిజల్ట్‌ అందించలేదు. దాంతో సుకుమార్‌, మహేష్‌కి హిట్‌ బాకీ ఉండిపోయాడు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' సినిమాలతో బ్లాక్‌ బస్టర్స్‌ అందించిన సుకుమార్‌, మహేష్‌కి కూడా ఆ స్థాయి హిట్‌ అందించాలనే కసితో ఉన్నాడట.

 

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దక్కించుకోవాలంటారు. అందుకే మహేష్‌ కోసం మళ్లీ '1 - నేనొక్కడినే' తరహాలోనే థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌ ఒకటి సిద్ధం చేశాడట. మొదట్లో కొంచెం కొత్తగా ఉండేలా ఓ హిస్టారికల్‌ స్టోరీని మహేష్‌కి వినిపించాడట. అయితే ఆ స్టోరీ పట్ల మహేష్‌ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో, తాజాగా ఓ థ్రిల్లర్‌ స్టోరీని వినిపించాడనీ తెలుస్తోంది. ఈ స్టోరీ పట్ల మహేష్‌ ఇంట్రెస్ట్‌ చూపడంతో ఆ స్టోరీని లాక్‌ చేశాడట సుకుమార్‌.

 

ప్రస్తుతం మహేష్‌ - వంశీ పైడిపల్లి కాంబోలో 'మహర్షి' సినిమా షూటింగ్‌ బిజీగా నడుస్తోంది. ఈ సినిమా దాదాపు జనవరికల్లా పూర్తి కానుందట. ఆ తర్వాత ఒక నెల రోజులు రెస్ట్‌ తీసుకుని, సుక్కు సినిమాపై మహేష్‌ దృష్టి పెట్టనున్నాడట. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. గతంలో మైత్రీ వారు మహేష్‌తో 'శ్రీమంతుడు' సినిమానీ, సుకుమార్‌తో బ్లాక్‌ బస్టర్‌ 'రంగస్థలం' నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ట్రిపుల్‌ కాంబో ఎలాంటి సక్సెస్‌ కొడుతుందో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS