బోయపాటి దమ్మున్నోడు.!

మరిన్ని వార్తలు

పెద్ద సినిమాలే చేస్తాను. చిన్న సినిమాలు చేయలేనంటున్నాడు డైరెక్టర్‌ బోయపాటి శీను. ఈయన కెరీర్‌లో వచ్చిన ఎనిమిది సినిమాలూ పెద్ద సినిమాలే. స్టార్‌ హీరోలే. అందులో మూడు సినిమాలు నందమూరి హీరోలతో తెరకెక్కించినవే. బాలయ్యతో 'సింహా', లెజెండ్‌' సినిమాలు రెండు సంచలన విజయాలు అందుకున్నాయి. ఎన్టీఆర్‌తో 'దమ్ము' దుమ్ము లేపింది. 

 

ఇక స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో తెరకెక్కించిన 'జయ జానకి నాయక' చిత్రంతోనూ సక్సెస్‌ కొట్టిన డైరెక్టర్‌ బోయపాటి శీను. అదీ బోయపాటి స్టామినా. ఇక తాజాగా మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటించిన 'వినయ విధేయ రామ' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో చరణ్‌లోని హీరోయిజాన్ని వెలికి తీసిన విధానం ఇప్పటికే ఆకట్టుకుంటోంది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం చరణ్‌కి ఈ స్టోరీ లైన్‌ వినిపించాడట. ఇన్నాళ్లకు సినిమా చేసే అవకాశం కలిగింది. 

 

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'వినయ విధేయ రామ'. ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ధియేటర్స్‌ వద్ద మెగా సందడి నెలకొంది. 90 కోట్ల వరకూ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసుకుని రికార్డుకెక్కిన 'వినయ విధేయ రాముడు' సంక్రాంతి సీజన్‌ని ఎలా క్యాష్‌ చేసుకుంటాడో చూడాలి మరి. ఓ పక్క 'రంగస్థలం' తర్వాత చరణ్‌ చేస్తున్న సినిమా కావడం, మరోపక్క మాస్‌ డైరెక్టర్‌ బోయపాటికున్న ఇమేజ్‌తో ఈ సినిమాపై ఫ్యాన్స్‌ చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకున్నారు. చూడాలి మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని వినయ విధేయ రాముడు అందుకుంటాడో లేదో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS