'జయ జానకి నాయక' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలకు కారణం బోయపాటి శ్రీను. ఇప్పటిదాకా ఆయన చేసిన సినిమాల్లో ఏదీ ఫెయిల్ కాలేదు. ఏ సినిమా చేసినా ఇంకో మెట్టు పైకెక్కేలా ఉండాలని బోయపాటి చెబుతుంటాడు. ఆయన మాటలకు తగ్గట్టే ఓ సినిమాని మించి ఇంకో సినిమా విజయం సాధిస్తోంది. 'సరైనోడు' తర్వాత, బోయపాటి స్టార్ హీరోని ఎంచుకోకుండా 'మాటకు కట్టుబడి' బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో 'జయ జానకి నాయక' సినిమా తెరకెక్కించాడు. భారీ రెమ్యునరేషన్ దక్కిందన్న వార్తల్నీ ఆయన కొట్టి పారేస్తాడు. 'ఈ సినిమాకి నేను తీసుకున్న రెమ్యునరేషన్ నా పాకెట్ మనీతో సమానం' అని ఆయన చెప్పడంలోనే, ఇది కమిట్‌మెంట్‌తో కమిట్‌మెంట్ కోసం చేసిన సినిమా అని అర్థమవుతుంది. ఎలా చూసినా ఈ సినిమాకి బోయపాటి, రకుల్ ప్రీత్ సింగ్ స్టార్స్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అప్‌కమింగ్ హీరో. అయితేనేం ఓ స్టార్‌కి ఉండాల్సిన లక్షణాలు, అర్హతలు అన్నీ అతనికి ఉన్నాడంటాడు దర్శకుడు. సినిమాలో ప్రతి సన్నివేశంలోనూ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఒదిగిపోయిన తీరు అద్భుతమని దర్శకుడు బోయపాటి చెప్పడంతోనే ఈ సినిమా ఎంత విజయం సాధించబోతుందన్నదానిపై ఓ అవగాహనకు వచ్చేయొచ్చు. బెల్లంకొండకి బోయపాటి అండగా ఉంటే ఈ సినిమా ఘనవిజయం సాధించకుండా ఉంటుందా?