ఆ హీరోతో నటించాలంటే నాకు భయం: రానా!

మరిన్ని వార్తలు

నేనే రాజు నేనే మంత్రి అంటూ ప్రేక్షకుల ముందుకి దూసుకువస్తున్న హీరో రానా కి ఒక హీరోతో నటించాలంటే భయం అని చెప్పాడు.

ఇంతకి ఆ హీరో ఎవరో కాదు ఆయనకీ స్వయాన బాబాయ్ అయిన విక్టరీ వెంకటేష్. నేనే రాజు నేనే మంత్రి చిత్ర ప్రమోషన్ల లో భాగంగా ఆయన ఈ కామెంట్ చేశాడు. ఈరోజు ఉదయం నుండి విజయవాడ లో ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణంలో ఆయనని విలేఖరుల నుండి- మీ బాబాయ్ తో ఎప్పుడు నటిస్తారు అన్న ప్రశ్నకి ఆయన స్పందిస్తూ- ఎందుకో మా బాబాయ్ తో చేయాలంటే నాకు భయంగా ఉంటుంది, కాని ఎప్పుడైనా ఒక మంచి కథ వస్తే తప్పకుండా చేస్తాను అని సమాధానం ఇచ్చాడు.

ఇక రానాతో పాటుగా నటి కాజల్ కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నది. ఇంకొక రెండు రోజుల్లోఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS