'ఛార్మి'ంగ్‌ గాళ్‌ సూపరుంది బాస్‌.!

మరిన్ని వార్తలు

అందానికి అందం, అభినయానికి అభినయం ముద్దుగుమ్మ ఛార్మి. గ్లామర్‌ డాళ్‌గా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. నాగార్జున, ప్రబాస్‌, నితిన్‌ ఇలా స్టార్‌ హీరోలు, యంగ్‌ హీరోల సరసన హీరోయిన్‌గా మెరిసింది. ఐటెం గాళ్‌గానూ తళుక్కుమంది. అయితే సడెన్‌గా నటనకు గుడ్‌బై చెప్పేసింది. నిర్మాణ రంగంలో స్ధిరపడింది. 'పూరీ కనెక్స్‌ (పీసీ)' పేరుతో డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌తో కలిసి నిర్మాణ సంస్థను రన్‌ చేస్తోంది ఛార్మి. 

 

అయితే చాలా కాలం తర్వాత లేటెస్టుగా ఛార్మి ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ పిక్స్‌లో ఛార్మి ఎప్పటిలాగే చాలా చాలా అందంగా కనిపిస్తోంది. ఇంతకు ముందు కన్నా అందంగా కనిపించడంతో, 'ఛార్మీ మేడమ్‌.. మీరు మళ్లీ హీరోయిన్‌గా సినిమాల్లో కనిపించరూ.. అంటూ అభిమానులు ఆశగా అడుగుతున్నారు. అయితే ఛార్మి మాత్రం తనకు పీసీ (పూరీ కనెక్ట్స్‌)నే ప్రాణమనీ చెబుతోంది. 

 

అంతేకాదు, పీసీ ఈజ్‌ మై లవ్‌, పీసీ ఈజ్‌ మై ఎనర్జీ, పీసీ ఈజ్‌ మై ప్రైడ్‌ అంటూ చేంతాడంత చెప్పుకొచ్చింది. అంటే ఛార్మికి అస్సలు నటించే ఉద్దేశ్యమే లేదని తెలిసిపోయింది. అయితే అంతటి అందం అలా తెర వెనకే మరుగున పడిపోతే అభిమానులకు బాధేగా మరి. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీగా తెరకెక్కిన 'జ్యోతిలక్ష్మి' సినిమా తర్వాత ఛార్మి సినిమాల్లో కనిపించింది లేదు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS