రామ్‌ కొత్త మూవీ అప్‌డేట్‌ వచ్చేసింది.!

By iQlikMovies - January 08, 2019 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

క్రియేటివ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో రామ్‌ కొత్త సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'ఇస్మార్ట్‌ శంకర్‌' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేస్తూ, ఫస్ట్‌లుక్‌ కూడా విడుదల చేశారు. ఫస్ట్‌లుక్‌లో రామ్‌ న్యూ గెటప్‌లో కనిపించాడు. చాలా రఫ్‌ లుక్‌లో రగ్గ్‌డ్‌గా కనిపించాడు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ని చిత్ర యూనిట్‌ వెరీ లేటెస్టుగా ప్రకటించింది. ఇంతకీ ఆ అప్‌డేట్‌ ఏంటంటే ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. 

 

ఒకప్పుడు నెంబర్‌ వన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఉన్న మణిశర్మ హవా ఇప్పుడు తగ్గింది. మధ్యలో కొన్నాళ్లు మ్యూజిక్‌ని వదిలేసి, ఈ మధ్య మళ్లీ వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. కానీ ఇదివరకటంతటి పాపులారిటీని దక్కించుకోలేకపోతున్నాడు మణిశర్మ. ఇటీవల విడుదలైన 'ఎమ్మెల్యే', 'దేవదాస్‌' తదితర చిత్రాలకు మణిశర్మ మ్యూజిక్‌ అందించాడు. కానీ నిలబడలేకపోయాడు. అగ్ర కథానాయకులైన చిరంజీవి, మహేష్‌బాబు, పవన్‌ కళ్యాణ్‌ తదితర హీరోలకు ది బెస్ట్‌ మ్యూజిక్‌ అందించాడు మణిశర్మ. 

 

తర్వాతి తరం హీరోలు చరణ్‌ వంటి హీరోలకు కూడా మణిశర్మ మ్యూజిక్‌ ఇచ్చాడు. చరణ్‌ నటించిన 'రచ్చ' మూవీ మణిశర్మ సంగీతంలో మ్యూజికల్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రామ్‌ మూవీకి మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్‌ని కంపోజ్‌ చేయనున్నాడనీ తెలుస్తోంది. రామ్‌ మంచి డాన్సర్‌ తెలిసిందే. మాస్‌ బీట్స్‌ ఉన్న సాంగ్స్‌కి ఇరగదీసే స్టెప్పులేయగలడు. సో మణిశర్మ రామ్‌ కోసం ఓ కొత్త మ్యూజిక్‌ని కంపోజ్‌ చేయనున్నాడట. ఈ సినిమాతో మణిశర్మ బౌన్స్‌బ్యాక్‌ అవుతాడేమో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS