ముద్దుగుమ్మ కేథరీన్‌కి స్టార్ డమ్ రాకపోయినా, వరుస ఆఫర్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్‌తో అమ్మడు బిజీగానే ఉంది. రేపు విడుదల కానున్న రెండు సినిమాల్లోనూ కేథరీన్ నటిస్తోంది. రానా హీరోగా తెరకెక్కుతోన్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో కేథరీన్ది ప్రాధాన్యత ఉన్న పాత్రే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్డ్ సినిమా ఇది. ఇందులో కేథరీన్ది రాజకీయ నాయకురాలి పాత్ర. గతంలోనూ 'సరైనోడు' సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో హుందాతనంగా కనిపించి, అందరి మెప్పు పొందింది కేథరీన్. అలాగే ఈ సినిమాలో కూడా కేథరీన్ పాత్ర ఆ తరహాలోనే ఉండబోతోందట. అలాగే మరో సినిమా జయ జానకి నాయకా' సినిమాలోనూ కేథరీన్ ఓ క్యారెక్టర్ చేస్తోంది. అది అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకపోయినప్పటికీ రిజిస్టర్డ్ క్యారెక్టరే అంటోంది. ఓ పాటలో జస్ట్ కాస్సేపు కనిపిస్తుందట కేథరీన్ ఈ సినిమాలో. ఇటీవలే 'గౌతమ్ నందా' సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో బికినీతో టాపు లేపేసింది కేథరీన్. టాలీవుడ్లో అమ్మడి బికినీ షో సూపర్ పాపులర్ అయిపోయింది ఈ సినిమాతో. ఏది ఏమైనా కేథరీన్‌కి మెయిన్ హీరోయిన్ కాకపోయినా, మంచి మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. అలాగే ఒక్కసారి సోలో హీరోయిన్ ఛాన్స్ దక్కిందంటే చాలు అమ్మడు ఇకపై కుమ్మేస్కోదూ!