మెగాస్టార్‌తో మిస్‌ అయ్యింది మెగా పవర్‌స్టార్‌కి ఫిక్సయ్యింది

By iQlikMovies - May 09, 2018 - 12:21 PM IST

మరిన్ని వార్తలు

హాట్‌ బ్యూటీ కేథరీన్‌కి మెగా ఫ్యామిలీ హీరో అయిన బన్నీతో మంచి స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే కేథరీన్‌కి చాలా అవకాశాలిప్పించాడు బన్నీ. హీరోయిన్‌గా ఉండాల్సిన అన్ని క్వాలిటీస్‌ ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ సెకండ్‌ హీరోయిన్‌గానూ, ఐటెం గాళ్‌గానే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. చేసినవి చాలా సినిమాలే. అన్నీ రిజిస్టర్డ్‌ క్యారెక్టర్సే. కానీ చెప్పుకోదగ్గ ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్‌ ఒక్కటీ చేయలేదు కేథరీన్‌. 

తాజాగా కేథరీన్‌ పేరు బోయపాటి సినిమా కోసం వినిపిస్తోంది. బోయపాటికి కూడా కేథరీన్‌ ఆస్థాన విద్వాంసురాలే. తన సినిమాలో ఐటెం సాంగ్‌ కావచ్చు. కథని మలుపు తిప్పే కీలక పాత్ర అయినా కావచ్చు. కథకి కీ క్యారెక్టర్‌లో కేథరీన్‌ భలే ఫిక్స్‌ చేస్తాడు బోయపాటి. నిజంగానే ఆ పాత్రకి భారీతనాన్ని తీసుకొస్తుందీ ముద్దుగుమ్మ కూడా. అందుకే బోయపాటి తన తాజా చిత్రంలో కేథరీన్‌ కోసం ఓ క్యారెక్టర్‌ని ఆల్రెడీ డిజైన్‌ చేసి ఉంచాడనీ సమాచారమ్‌. 

బోయపాటి శీను, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కలయికలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'రాజవంశస్థుడు' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో మెగాపవర్‌స్టార్‌తో 'భరత్‌' బ్యూటీ కైరా అద్వానీ జత కడుతుండగా, మరో ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం కేథరీన్‌ని ఎంచుకునే యోచనలో బోయపాటి ఉన్నట్లు తెలుస్తోంది. 

అంతేకాదు, కేథరీన్‌కి చరణ్‌తో ఓ స్పెషల్‌ సాంగ్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నారట. చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ'లో కేథరీన్‌ ఐటెం సాంగ్‌ చేయాల్సి ఉంది. కానీ లాస్ట్‌ మినిట్‌లో ఆ ఆఫర్‌ని లక్ష్మీరాయ్‌ తన్నుకెళ్లిపోయింది. అలా అప్పుడు మిస్‌ చేసుకున్న ఆ ఛాన్స్‌ ఇప్పుడు మళ్లీ దక్కించుకుంటుందేమో కేథరీన్‌ చూడాలి మరి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS