సమంతకిది ఫస్ట్‌ టైమ్‌.!

By iQlikMovies - May 09, 2018 - 12:13 PM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న సమంత ఇంతవరకూ తెలుగులో డబ్బింగ్‌ మాత్రం చెప్పుకోలేదు. తెలుగులో చక్కగా మాట్లాడుతుంది. అలాగే వాయిస్‌ కూడా స్వీట్‌గా ఉంటుంది. అయినా ఆ అవకాశం ఇంతవరకూ తనకి రాలేదంటోంది సమంత. నిజానికి 'రంగస్థలం'లోనే సమంత తన వాయిస్‌ వినిపించాలనుకుంది. కానీ కుదరలేదట. అప్పటికీ పల్లెటూరి అమ్మాయిగా గోదారి యాసని ప్రాక్టీస్‌ చేసిందట కూడా. కానీ ఆ సినిమాకి సెట్‌ కాలేదట. అయితే ఈ సారి సమంత తన పాత్రకు తానే సొంత గళం వినిపించింది. 

ఏ సినిమాలో అంటారా? ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానున్న అలనాటి మేటి నటి సావిత్రి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న 'మహానటి' కోసం. ఈ సినిమాలో సమంత కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సమంతది మెయిన్‌ రోల్‌ కాకున్నా, సినిమాకి అత్యంత కీలకమైన పాత్ర ఈ సినిమాలో. అంతేకాదు వెరీ వెరీ ఎమోషనల్‌ క్యారెక్టర్‌ అట కూడా. జర్నలిస్టు మధురవాణిగా ఆ పాత్రలో తాను నటించాను అన్నదాని కన్నా, జీవించేశానేమో అనిపిస్తుంది అని సమంత చెప్పింది. ఓ సీన్‌లో గ్లిజరిన్‌ వేసుకోకుండా, ఏడ్చేసిందట. అంతగా తనని ఇన్‌స్పైర్‌ చేసిన ఆ సీన్‌ ప్రేక్షకుల్ని కూడా కంటతడి పెట్టించేలా ఉంటుందని సమంత చెప్పింది. 

ఈ రోజు గ్రాండ్‌గా ఈ సినిమా ధియేటర్స్‌లో సందడి చేయనుంది. ఇక భారీ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎవరెవరు ఎలా మెప్పించారన్నది కాసేపట్లోనే తెలిసిపోతుంది. కీర్తి సురేష్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమాని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS