అవును శృతిహాసన్ పెళ్లి చేసుకుంటుందట. కానీ ఎవర్నో తెలుసా.? అబ్బాయిని అయితే అస్సలు కాదు. అమ్మాయిని.. ఆమె కూడా ఎవరో తెలుసా.. మిల్కీ బ్యూటీ తమన్నాని. మీరేం తప్పుగా అనుకోకండే.. శృతిహాసన్, తమన్నా మధ్య స్నేహం ఎంత గొప్పదో అందరికీ తెలిసిందే. పలుమార్లు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తమ మధ్య స్నేహాన్ని చాటి చెప్పుకున్నారు. అయితే అసలు విషయానికి వస్తే, శృతిహాసన్‌కి ఈ మధ్య ఓ సందర్భంలో మీడియా నుండి విచిత్రమైన ప్రశ్న ఎదురైంది.
మీరు ఒకవేళ అబ్బాయి అయితే ఏ హీరోయిన్‌తో డేట్‌కి వెళ్తారు.. ? అనే ప్రశ్నకు సమాధానంగా శృతిహాసన్ తడుముకోకుండా తమన్నా పేరు చెప్పేసింది. తమన్నా అంటే తనకి అంత ఇష్టమట. 'తమన్నా చాలా మంచి అమ్మాయి.. నేనే అబ్బాయినైతే తమన్నాని పెళ్లి చేసేసుకునేదాన్ననీ..' ఫన్నీగా శృతిహాసన్ ఆన్సర్ ఇచ్చింది. అదన్నమాట ట్విస్ట్. ఇకపోతే తమన్నాకి హృతిక్ రోషన్ అంటే ఇష్టమని గతంలో చెప్పింది. ఒకవేళ లిప్‌లాక్ చేయాల్సి వస్తే, హృతిక్ రోషన్‌తోనే చేస్తానని కూడా సెలవిచ్చింది.
ఏది ఏమైనా ఈ మధ్య సెలబ్రిటీలకు ఇలాంటి ప్రశ్నలు ఎదురవడం చాలా కామన్ అయిపోయింది. అందుకే సెలబ్రిటీలు కూడా అంతే సెన్సాఫ్ హ్యూమర్‌తో సమాధానాలిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. శృతిహాసన్ మాత్రం సినిమాలకు కాస్త దూరంగా ఉంది. ఇటీవలే మెగాస్టార్ సినిమాలో శృతిహాసన్ అంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ గాసిప్‌లో నిజమెంతో నిలకడ మీద తెలియాల్సి ఉంది.