టాక్ అఫ్ హి వీక్- ఛలో, టచ్ చేసి చూడు & హౌరా బ్రిడ్జ్

మరిన్ని వార్తలు

ఈ సంవత్సరం తొలి సీజన్ అయిన సంక్రాంతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చేదు అనుభావాన్ని మిగిల్చింది అనే చెప్పొచ్చు. అయితే ఆ సీజన్ ముగిసిన వెంటనే ఫిబ్రవరిలో దాదాపు ఒక 10సినిమాల వరకు థియేటర్లని తాకనున్నాయి. 

ఇక అందులో ఈ వారం విడుదలైన మూడు చిత్రాల- ఛలో, టచ్ చేసి చూడు & హౌరా బ్రిడ్జ్ గురించి ఈ వారం టాక్ అఫ్ ది వీక్ లో మాట్లాడుకుందాము. ముందుగా నాగశౌర్య ఛలో చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ఈ సినిమా పైన ముందునుండే పాజిటివ్ టాక్ ఉండడం అలాగే ట్రైలర్ కూడా ఈ సినిమా పైన ప్రేక్షకులకి నమ్మకం పెంచేలా చేసింది. 

ఛలో సినిమా కథ రొటీన్ అయినప్పటికీ హీరో పాత్ర, కథనంలో వైవిధ్యం అలాగే వాటికి తగినంతగా హాస్యాన్ని జోడించడంతో ఈ సినిమా విజయం సాధించింది. అలాగే ప్రేక్షకులు కూడా ఈ చిత్రంలోని మంచి హాస్యాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఇక రెండవ చిత్రం రవితేజ టచ్ చేసి చూడు అందరి అంచనాలని తలకిందులు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడింది. మూస మాస్ కథనే దర్శకుడు విక్రమ్ నమ్ముకోవడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిరస్కరించారు. రవితేజ ఈ చిత్రంలో హైలైట్ అయినప్పటికీ ఆయన ఒక్కడే ఈ చిత్రాన్ని నెట్టుకురాలేకపోయాడు. 

ముచ్చటగా ఈ వారం విడుదల అయిన మూడవ చిత్రం హౌరా బ్రిడ్జ్. ఈ చిత్రం పైన అంచనాలు లేకపోవడం, భారీ కాస్టింగ్ లేకపోవడం అలాగే విడుదలయ్యాక ఈ చిత్ర కథలో సత్తా లేకపోవడంతో ఈ చిత్రం కూడా రవితేజ సినిమాలాగే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. హీరోయిన్ గా చాందిని కి మంచి మార్కులే పడగా హీరోగారాహుల్ రవీంద్రన్ మాత్రం మెప్పించాలేకపోయాడు. 

ఇది ఈ వారం విడుదలైన మూడు చిత్రాల తాలుకా టాక్.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS