చరణ్‌ - మహేష్‌ ఎట్‌ సింగిల్‌ ఫ్రేమ్‌: ఫ్యాన్స్‌కి పండగే పండగ.

మరిన్ని వార్తలు

అప్పుడప్పుడూ స్పెషల్‌ ట్వీట్స్‌తో అభిమానుల్ని తనదైన శైలిలో అలరిస్తూ ఉండే ఉపాసన తాజాగా మరోసారి మురిపించింది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన సెలబ్రేషన్స్‌నీ, భర్త రామ్‌ చరణ్‌కి సంబంధించి కొత్త సినిమా సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్స్‌నీ అభిమానుల కోసం పోస్ట్‌ చేస్తూ ఫ్యాన్స్‌కి కొత్త ఉత్సాహాన్నిస్తుంటుంది ఉపాసన. 

 

అయితే ఈ సారి క్రిస్టమస్ సంబరాలకు సంబంధించిన లేటెస్ట్‌ పిక్స్‌ని పోస్ట్‌ చేసి, ప్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. ఈ పిక్స్‌లో చరణ్‌తో పాటు, మహేష్‌ ఫ్యామిలీ కూడా ఉండడం డబుల్‌ ధమాకా అయ్యింది. చరణ్‌, మహేష్‌ మంచి ఫ్రెండ్స్‌ అన్న సంగతి తెలిసిందే. అలాగే మహేష్‌ భార్య నమ్రత, చరణ్‌ భార్య ఉపాసనలు కూడా చాలా క్లోజ్‌గా ఉంటారు. అప్పుడప్పుడూ వీరిద్దరి ఫ్యామిలీస్‌ కలిసి వెకేషన్స్‌కి వెళ్తుండడం కూడా గతంలో పలు మార్లు చూశాం. 

 

తాజాగా క్రిస్టమస్ వేడుకల్లో చరణ్‌, మహేష్‌ ఫ్యామిలీతో కలిసి పండగ చేసుకున్నారు. ఆ పిక్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, అభిమానులు కూడా పండగ చేసుకునేలా చేసింది మెగా కోడలు ఉపాసన. మహేష్‌ కూతురు సితారతో ఉపాసన దిగిన ఫోటో మెయిన్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం చరణ్‌ 'వినయ విధేయ రామ' చిత్రంలో నటిస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్‌ 'మహర్షి'తో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌కి ఈ సినిమా విడుదల కానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS