చీర కట్టినా.. ఫోటోలు తీసి పోర్న్ సైట్ లో పెడుతున్నారు: చిన్మయి

మరిన్ని వార్తలు

దక్షిణాది సినీ పరిశ్రమలో గాయని గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిన్మయి.. మీ టూ ఉద్యమం ద్వారా సృష్టించిన వివాదాలు అందరికీ తెలిసిందే. మొదట తమిళ రచయిత వైరముత్తు తనపై లైంగిక వేధింపులకి పాల్పడ్డారని గళమెత్తిన చిన్మయి, ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ వివాదాల వల్ల ఇప్పటికే తనని డబ్బింగ్ యూనియన్ నుండి తొలగించారని పేర్కొన్న ఈమె తాజాగా మరో ఇంటరెస్టింగ్ ట్వీట్ చేసింది.

 

తాజాగా ఓ నెటిజెన్ చిన్మయి శ్రీపాద సింగింగ్ టాలెంటుని ప్రశంసిస్తూ, ఈవెంట్స్ లో చీరలు కట్టుకుంటే భారతీయ మహిళల అందరికీ ఆదర్శంగా కనిపిస్తారు. అలాంటిది మీరు చీరలు ఎందుకు కట్టుకోవడం లేదు అని అడిగిన ప్రశ్నకు 'తను సాధారణంగా చీరలే కట్టుకునేదాన్నని, కానీ ఈ మధ్య కొంతమంది తన నడుము భాగాన్ని, ఛాతి భాగాన్ని అసభ్యకరంగా ఫోటోలు తీసి సాఫ్ట్ పోర్న్ సైట్లలో పెడుతున్నారని పేర్కొంది. అందువల్లే తాను చీరలు కట్టుకోవడం మానేశానంటూ మరో విషాదాన్ని బట్టబయలు చేసింది. 

 

చీర కట్టినా, జీన్స్ వేసుకున్నా తాను భారతీయ మహిళనే అని సమాధానం ఇచ్చింది. మీ టూ ఉద్యమం వల్ల తన కెరీర్ కి ఎన్ని అవరోధాలు ఎదురవుతున్నా.. సినీ రంగంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను.. దైర్యంగా బట్టబయలు చేయటంలో మాత్రం వెనుకాడబోనని ఈ ట్వీట్ ద్వారా చెప్పకనే చెబుతుంది చిన్మయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS