నిధి అగర్వాల్‌ ఒప్పుకోవడంలేదు.!

By iQlikMovies - January 30, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

'మిస్టర్‌ మజ్ను' ఫ్లాప్‌ అని దాదాపుగా తేల్చేశారు. కానీ ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నిధి అగర్వాల్‌ మాత్రం అందుకు అస్సలు ఒప్పుకోవడం లేదట. 'మిస్టర్‌ మజ్ను' ఫ్లాప్‌ కాదు, హిట్టే అంటోందట. డెబ్యూ మూవీ 'సవ్యసాచి'తో పోల్చితే, ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ చాలా టఫ్‌గా ఉంటుంది. ఈ క్యారెక్టర్‌లో నటించేందుకు చాలా కష్టపడ్డాను. ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. నా నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. 

 

సినిమాపై వచ్చే విమర్శల్ని పట్టించుకోవల్సిన అవసరం నాకు లేదు. దాదాపు 99 శాతం మెసేజ్‌లు పోజిటివ్‌గా వస్తున్నాయి. సో 'మిస్టర్‌ మజ్ను' మంచి విజయాన్నిచ్చింది నాకు..' అంటోంది నిధి అగర్వాల్‌. 'సవ్యసాచి' ఫ్లాప్‌ అంటే ఓకే కానీ, 'మిస్టర్‌ మజ్ను' సూపర్‌ హిట్‌ అని సోలో సర్టిఫికెట్‌ ఇచ్చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సరేలే ఆమె నమ్మకం ఆమెది. ట్రేడ్‌ పండితులు మాత్రం ఈ సినిమాని డిజాస్టర్‌గా తేల్చేశారు. 

 

అంతేకాదు, నిధి అగర్వాల్‌కి ఐరెన్‌లెగ్‌ ట్యాగ్‌ కూడా ఇచ్చేశారు. కానీ నిధి మాత్రం స్ట్రాంగ్‌గా ఉంది. తాజాగా రామ్‌తో 'ఇస్మార్ట్‌ శంకర్‌' మూవీలో ఛాన్స్‌ దక్కించుకుంది. పూరీ జగన్నాధ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటు రామ్‌కీ, అటు పూరీకి ఈ సినిమాతో విజయం దక్కిందా.? నిధి అగర్వాల్‌ దశే మారిపోతుంది. ఏమో ఆ అదృష్టం నిధి దక్కించుకుంటుందో లేదో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS