వరుణ్ తేజ్ 'వాల్మీకి' పోస్టర్ పై రాజుకున్న వివాదం

By iQlikMovies - January 31, 2019 - 08:30 AM IST

మరిన్ని వార్తలు

ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ స్టోరీతో వేరియేషన్ ఉన్న క్యారెక్టర్లు చేస్తూ.. మెగా కాంపౌండ్ లో విలక్షణ హీరోగా పేరు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ ఓ కొత్త మూవీ సైన్ చేసాడు. ఆదివారం రామానాయుడు స్టూడియోలో లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమాకి వాల్మీకి అనే టైటిల్ ని ఖరారు చేసారు. తమిళంలో బాబీ సింహ నటించిన 'జిగ‌డ్తాండ‌' సినిమాకి రీమేకే ఈ వాల్మీకి. 

 

అయితే, ఇప్పుడు వాల్మీకి సినిమా టైటిల్ పోస్టర్ వివాదంగా మారింది. టైటిల్ లోగోలో క్లాప్ బోర్డు, తుపాకీ మరియు సినిమా రీలు వంటి ప్రాపర్టీస్ ఉపయోగించటం జరిగింది. అందువల్ల, వాల్మీకి పేరుకి తుపాకీ జోడించడం ఏంటని ఆయా కులస్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. అయినాసరే, ఈ విషయంపై చిత్ర బృందం ఇంకా స్పందించలేదు. ఈ వివాదం ఎంతవరకు దారి తీస్తుందో చూడాలిమరి. 

 

14రీల్స్ పతాకంపై రామ్ అచంట, గోపి అచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మిగతా నటీనటుల వివరాలు త్వరలో తెలియనున్నాయి. 'డీజే' తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. 'ఎఫ్ 2' సక్సెస్ తో మంచి ఊపుమీదున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లక్ అయినా ఈ సినిమాకి కలిసొచ్చి.. హరీష్ ఖాతాలో మంచి హిట్ పడుతుందేమో వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS