టెస్ట్‌ షూట్‌కి సై సై అంటోన్న 'సైరా' టీమ్‌

మరిన్ని వార్తలు

చిరంజీవి 151 చిత్రంగా తెరకెక్కుతోన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ సినిమా ప్రారంభమై చాలా కాలమే అయ్యింది. కానీ ఇంకా సెట్స్‌ మీదికి వెళ్లడం లేదు. అయితే చిత్ర యూనిట్‌ మాత్రం ఈ సినిమా విషయంలో వెనక చాలానే కసరత్తులు చేస్తోంది. సెట్స్‌ డిజైన్‌ చేయడం దగ్గర నుండీ, నటీ నటులకు వేసే గెటప్స్‌, మేకప్‌ తదితర అంశాలపై గ్రౌండ్‌ వర్క్‌ చేస్తూనే ఉంది. 

తాజాగా నటీ నటులపై టెస్ట్‌ షూట్స్‌ చేయడంలో టెక్నికల్‌ బృందం బిజీగా ఉందట. ఒకరి తర్వాత ఒకరుగా టెస్ట్‌ షూట్స్‌ నిర్వహిస్తోందట. అయితే మామూలుగా ఇలా టెస్ట్‌ షూట్స్‌ చేయడానికి నటీనటులు ఒప్పుకోరు. కానీ ఈ సినిమా కంటెన్ట్‌ నచ్చి అందరూ తమంతట తాముగా టెస్ట్‌ షూట్‌లో పాల్గొంటున్నారట. చిరంజీవి గెటప్‌ దాదాపు ఫైనల్‌ అయ్యిందనీ తాజా సమాచారమ్‌. గుబురు గెడ్డం, మీసాలతో చిరంజీవి కనిపించనున్నారనీ తెలియవస్తోంది. 

ఇకపోతే ఈ టెస్ట్‌ షూట్స్‌, సెట్స్‌ మేకింగ్స్‌ కంప్లీట్‌ అయిపోగానే చిత్రం సెట్స్‌ మీదికి వెళ్లనుందట. వీలైనంత త్వరగా ఈ పనులన్నీ కంప్లీట్‌ చేసి ఈ ఏడాది చివరికల్లా చిత్రాన్ని సెట్స్‌ మీదికి తీసుకెళ్లే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్‌చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది యూనివర్సల్‌ సబ్జెక్ట్‌ కాబట్టి మేకింగ్‌ విషయంలో చాలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

సినిమాని యూనివర్సల్‌గా విడుదల చేసే యోచనలో నిర్మాత రామ్‌ చరణ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS