తొమ్మిదేళ్ల తర్వాత సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చి, బాక్సాఫీస్ బద్దలు కొట్టే హిట్ అందుకున్నాడు చిరంజీవి. అనూహ్యంగా వచ్చిన ఆ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు చిరంజీవి. ఈ సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో చాలా మంది రైటర్స్ చిరంజీవి మీదే తమ ఫోకస్ పెట్టారు. కథలు పట్టుకుని చిరంజీవి చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇప్పటికే చిరంజీవి సురేందర్ రెడ్డికి కమిట్ అయ్యాడు. తర్వాత బోయపాటి శీను కూడా లైన్‌లో ఉన్నాడు. వీళ్లే కాక హరీష్ శంకర్ వంటి యంగ్ డైరెక్టర్స్ కూడా చిరంజీవికి కథలు వినిపిస్తున్నారట. ఓ పక్క టీవీ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు', మరో పక్క 'ఖైదీ నెంబర్ 150' సినిమా ఇచ్చిన సక్సెస్ ఎంజాయ్‌మెంట్ చిరంజీవిని ఉక్కిరిబిక్కిరి చేస్తూండగా, వాటితో పాటు రకరకాల కథలు వింటూ చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏం చేయాలో కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారట. అసలు సినిమాలే చేయననుకున్న స్థాయి నుండి చిరంజీవి, ఇప్పుడు ఏ సినిమా చేయాలో తెలియనంత బిజీ అయిపోయారు. సురేందర్ రెడ్డితో, రామ్ చరణ్ నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కనుందన్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి 151వ సినిమాగా అదే సినిమా తెరకెక్కుతుందా? లేక మరో కథకేమైనా చిరంజీవి కమిట్ అవుతాడా అనే విషయం తెలియరావడం లేదు. మొత్తానికి చిరంజీవి నుండి రాబోయే సినిమా ఏంటనేది క్లారిటీ రావాలంటే చరన్ పుట్టినరోజు వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే అదే రోజు చిరంజీవి చేయబోయే సినిమా పట్టాలెక్కనుందని సమాచారమ్.