మెగాస్టార్ చిరంజీవి నటించబోయే సైరా నరసింహా రెడ్డి చిత్రానికి సంబందించిన ప్రకటన ఆయన పుట్టినరోజు నాడే జరిగినా ఆ తరువాత ఈ చిత్రానికి సంబందించిన ఏ ఒక్క సమాచారం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇక ఈ చిత్రం గురించి పలురకాలైన వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ముఖ్యంగా ఈ చిత్రానికి ముందుగా ఛాయాగ్రహకుడిగా రవి కె చంద్రన్ ని తీసుకోగా ఇప్పుడు షూటింగ్ వాయిదా పడుతుండడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి వెళ్ళిపోయారు అని కథనం. అలాగే ఆయన స్థానంలో రత్నవేలుని తీసుకున్నట్టుగా తెలుస్తున్నది.
ఇదిలావుండగా ఈ సైరా చిత్రం వచ్చే ఏడాది నుండి మొదలువుతుంది అని అంటున్నారు. ఎందుకంటే, సైరా నిర్మాత అయిన రామ్ చరణ్ తన రంగస్థలం షూటింగ్ ముగించేసి పూర్తిగా సైరా చిత్రం పైనే తన దృష్టి నిలపబోతున్నట్టుగా సమాచారం.
ఏదైతేనేమి సైరా చిత్రాన్ని ప్రకటించి చాలా కాలమే అవుతున్నా ఇంతవరకు షూటింగ్ ప్రారంభం కాకపోవడం ఫ్యాన్స్ ని కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశం.