బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే అంతటి సంచలనంగా మారే అంతలా ఆమె చేసిన వ్యాఖ్య ఏమిటో తెలుసుకోవాలంటే ఈ క్రింద చదవాల్సిందే-
ప్రియాంకని ట్విట్టర్ వేదికగా ఒక అభిమాని తమిళ స్టార్ హీరో విజయ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించగా, ఆమె వెంటనే- ఆయనతో కలిసి నటించేందుకు ఇష్టపడతా అలాగే ఆయనకు నేను పెద్ద అభిమానిని అని చెప్పుకొచ్చింది.
ఇప్పటికే విజయ్ నటించిన మెర్సల్ చిత్రం దేశవ్యాప్తంగా వివాదాలకి కేర్ అఫ్ అడ్రస్ గా మారుతున్న ఈ సమయంలో ఇటువంటి సమాధానం చెప్పడంతో ప్రియాంక వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఇదిలావుండగా ప్రియాంక తొలిగా చేసిన తమిళ చిత్రంలో విజయ్ హీరో అవ్వడం గమనార్హం.
మొత్తానికి మెర్సల్ వివాదంలో ఇది ఒక కొత్త రిలీఫ్ అని చెప్పొచ్చు.