'తొలిప్రేమ' పాటలకు డాన్స్‌ చేయాలనిపించింది - చిరు

మరిన్ని వార్తలు

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం 'తొలిప్రేమ'. 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌' తదితర చిత్రాల్లో నటుడిగా ఆకట్టుకున్న యంగ్‌స్టర్‌ వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లవ్‌ స్టోరీ పాతదే. అయినా కానీ ఆ లవ్‌ స్టోరీని చాలా ఫ్రెష్‌గా అనిపించేలా వెంకీ తన దర్శకత్వంలో తన ప్రతిభ చూపించాడంటూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవిని కూడా ఈ సినిమా ఎంతో ఇన్‌స్పైర్‌ చేసిందట. ఈ సినిమాలో పాటలు వినసొంపుగా ఉన్న మాట వాస్తవమే. 

అయితే మెగాస్టార్‌కి ఈ మ్యూజిక్‌ చాలా బాగా నచ్చిందట. ప్రతీ పాటా వింటుంటే తనకే లేచి స్టెప్పులేయాలనిపించిందట. వరుణ్‌తేజ్‌ ఇంతవరకూ నటించిన సినిమాల్లో పెద్దగా డాన్సులేసింది లేదు. వరుణ్‌ హైట్‌ డాన్సులకి మైనస్‌ అవుతుందని భావించారంతా. కానీ ఈ సినిమాలో పర్‌ఫెక్ట్‌గా డాన్సులు కూడా వేసేసి, మన మెగా రాకుమారుడు అందంలోనే కాదు, డాన్సుల్లో కూడా సూపర్‌ అనిపించేసి, ఆ వెలితి కూడా తీర్చేశాడు. తమన్‌ మ్యూజిక్‌కి వరుణ్‌ డాన్సులు ఇరగదీసేశాడంటూ చిరంజీవి కూడా కాంప్లిమెంట్‌ ఇచ్చేశాడు. 

తొలి సినిమా 'ముకుందా'తో కలిపి, 'కంచె' తదితర చిత్రాలతో విభిన్నమైన రూటులో మెగా ప్రిన్స్‌ నడుస్తున్నాడన్న ఇమేజ్‌ నుండి, లవర్‌ బోయ్‌ ఇమేజ్‌కి వచ్చేశాడు వరసగా లవ్‌ స్టోరీస్‌తో హిట్స్‌ కొట్టి. 'ఫిదా'తో అనూహ్యంగా హిట్‌ అందుకున్న వరుణ్‌ తాజాగా 'తొలిప్రేమ'తోనూ మంచి హిట్‌ కొట్టి, బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. 

నిజానికి చెప్పాలంటే ఈ ఏడాది బాక్సాఫీస్‌కి మంచి వసూళ్లు రాబట్టిన చిత్రంగా చెప్పుకోదగ్గ చిత్రం లేదు. అయితే ఆ బోణీ ఇప్పుడు వరుణ్‌తోనే స్టార్ట్‌ అయ్యిందనిపిస్తోంది. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా సెకంగ్‌ వీక్‌ కలెక్షన్స్‌ కూడా అదరగొట్టేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS