మెగాస్టార్‌, కొరటాల: ‘ఆచార్య’ ‘స్టోరీ’ ఇదేనా.?

మరిన్ని వార్తలు

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మెగాస్టార్‌ 152 వ చిత్రానికి ఎలాంటి హంగులూ, ఆర్భాటాల్లేకుండా, ఎలాంటి ఉత్కంఠ క్రియేట్‌ కాకుండా సింపుల్‌గా టైటిల్‌ అనౌన్స్‌ చేసేశారు స్వయానా మెగాస్టార్‌ చిరంజీవి. ఇక ఇప్పుడు ఈ సినిమా స్టోరీ ఇదే.. అంటూ మరో చర్చ తాజాగా తెరపైకి వచ్చింది. ఇంతవరకూ దేవాలయ కుంభకోణం బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా ఉండబోతోందని ప్రచారం జరిగింది. కానీ, కొత్తగా వెలుగులోకి వచ్చిన ప్రచారం ద్వారా, ఈ సినిమా కథ అటవీ భూముల పరిరక్షణ నేపథ్యంలో ఉండనుందని మాట్లాడుకుంటున్నారు. అటవీ భూముల పరిరక్షణకు ఓ మాజీ నక్సలైట్‌ ఎలాంటి పోరాటం చేశాడు.? అనేదే సినిమా కథట.

 

ఆ మాజీ నక్సలైట్‌ ‘ఆచార్య’ పాత్రలోనే చిరంజీవి కనిపించనున్నారట. ఆ పాత్రకు సంబంధించి చిరంజీవి లుక్‌ కూడా ఆల్రెడీ లీక్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక కొరటాల తన ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక సామాజిక అంశాన్ని పవర్‌ఫుల్‌గా టచ్‌ చేస్తుంటాడు. ఆ సామాజిక అంశానికి అన్ని యాంగిల్స్‌ నుండీ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేసి, సినిమాకి పర్‌ఫెక్ట్‌ రూపమిస్తుంటాడు. ఇక మెగాస్టార్‌ కోసం కొరటాల ఏ ఏ హంగులు సిద్ధం చేశారో చూడాలి మరి. ఈ సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు గెస్ట్‌ రోల్‌ పోషిస్తున్నారంటూ మరో ప్రచారం ఉంది. ముద్దుగుమ్మ త్రిష, ఈ సినిమాలో చిరంజీవితో జోడీ కడుతోంది. ప్రముఖ నిర్మాత నిరంజన్‌ రెడ్డితో కలిసి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS