చిరంజీవి కోసం సల్మాన్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీకి బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ అత్యంత సన్నిహితుడు. గతంలో పలు సందర్భాల్లో చరణ్‌కి ఫిట్‌నెస్‌ విషయంలో తన వంతు సూచనలు, సలహాలు ఇస్తుంటాడు సల్మాన్‌ఖాన్‌. చరణ్‌ నటించిన 'ధృవ' సినిమాలో చరణ్‌ ఫిట్‌ బాడీతో, సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తాడు. ఆ కండలు తీరిన బాడీని బిల్డప్‌ చేయడానికి ఈ బాలీవుడ్‌ కండల వీరుడి ఫిట్‌నెస్‌ ట్రైనర్‌నే ప్రిఫర్‌ చేశాడు. ఇప్పుడు మరోసారి ఆయన అవసరం పడిందట. ఈ సారి చిరంజీవి కోసం సల్మాన్‌ఖాన్‌ తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ని పంపిస్తున్నాడట.

 

చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్‌ పూర్తయిపోయింది. తదుపరి చిరంజీవి కొరటాల శివతో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి కాస్త స్లిమ్‌గా కనిపించనున్నాడట. అందుకోసం సన్నబడాలనుకుంటున్నాడట. అనుభవం ఉన్న ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ అయితే అందుకు మంచిదని చరణ్‌ భావించి, చిరంజీవి ఫిట్‌నెస్‌ కోసం సల్మాన్‌ఖాన్‌ సలహా తీసుకున్నాడట. సల్మాన్‌ వెంటనే తన పర్సనల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ని చిరంజీవి కోసం పంపించాడట. ఆల్రెడీ చిరంజీవి వర్కవుట్స్‌ స్టార్ట్‌ చేసేశాడనీ సమాచారమ్‌.

 

ఇకపోతే, 'సైరా నరసింహారెడ్డి' ప్రస్తుతం గ్రాఫిక్స్‌ పనుల్లో బిజీగా ఉంది. సెప్టెంబర్‌కల్లా గ్రాఫిక్స్‌ వర్క్‌ కంప్లీట్‌ అయిపోనుందట. ఆ తర్వాత ప్రమోషన్స్‌, ఆ పై విడుదల.. ఇలా పక్కా ప్లానింగ్‌తో స్కెచ్‌ ప్రిపేర్‌ చేస్తున్నాడు చరణ్‌. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజు 'సైరా'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది చరణ్‌ వ్యూహం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS