చిరంజీవి-రవితేజ.. ఇద్దరూ కలసి సందడి చేయబోతున్న చిత్రం వాల్తేరు వీరయ్య. ఇప్పటికే ఇద్దరి టీజర్లు వచ్చాయి. చిరుది కేవలం టైటిల్ టీజరే. చిన్న ఇంట్రోతో సరిపెట్టారు. కానీ రవితేజ టీజర్ లో మాత్రం ఎనర్జీ నింపేశారు. యాక్షన్, డైలాగులు, మేనరిజం అన్నీ కలిసి.. ఇందులో రవితేజ పాత్రపై అంచనాలు పెంచారు. వాల్తేరు వీరయ్యలో పోలీస్ గా కనిపించబోతున్నాడు రవితేజ. దీంతో ఇది దొంగా పోలీసు ఆటలా ఉంటుందని చాలా మంది ఊహించారు.
కానీ అది నిజం కాదు. ఇందులో చిరంజీవి, రవితేజ పాత్రల మధ్య మంచి ఎమోషన్ వుంటుంది. రవితేజ పాత్రకు ఒక యాంటీ క్లైమాక్స్ వుంటుంది. అదే వాల్తేరు వీరయ్యలో కోర్ ఎమోషన్. దిని తర్వాత వీరయ్య ఎలా తిరగబడ్డాడనే పాయింట్ పై మిగతా కథ నడుస్తుందని సమాచారం. ప్రస్తుతం సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. జనవరి 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.