గత కొంత కాలంగా టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్న కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై పలువురు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అనుభవంతో కొందరు, అనుభవం లేకుండా మరికొందరు, బాధితులమంటూ కొందరు, మాకలాంటి అనుభవం ఎదురు కాలేదు, కానీ కాస్టింగ్ కౌచ్ గురించి విన్నాను అని ఇంకొందరు, ఇలా తమకి తోచిన విధంగా ఈ ఇష్యూపై తమ తమ అభిప్రాయాలను వెలుగులోకి తెస్తున్నారు.
ఈ కోవలోనే బుల్లితెర హాటెస్ట్ యాంకర్ రేష్మీ తాజాగా స్పందించింది. అనవరసరంగా సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయకండి. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రతీ రంగంలోనూ ఉంది. సినీ ఇండస్ట్రీ పరువు తీయకండి అని స్పందించింది. అంతేకాదు, ఈ ఇష్యూని ఇక ఇక్కడితో ఫుల్‌స్టాప్ చేసేయండి అని రేష్మీ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టింది. నటి శ్రీరెడ్డి లేవనెత్తిన ఈ కాస్టింగ్ కౌచ్ వివాదం సినీ ఇండస్ట్రీతో పాటు, రాజకీయ వర్గాల్లో కూడా అలజడి రేపింది. రాజకీయాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్న రేణుకా చౌదరి తదితర మహిళా మణులు కూడా ఈ విషయంపై స్పందించారు. తమ అభిప్రాయాన్ని తెలియచేశారు.
అయితే సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాస్టింగ్ కౌచ్ సెగలు కక్కుతోంది. కామ్ అప్ అయిపోయినట్లే కనిపించినా, మళ్లీ ఏదో ఒక మూల నుండి రైజ్ అవుతోంది. మొత్తానికి ఇష్యూని రైజ్ చేసిన శ్రీరెడ్డికి మొదట్లో అందినట్లుగా అన్ని వైపుల నుండీ సరైన సపోర్ట్ ఇప్పుడు అందకపోవడంతో, ఆమె మాటల్ని, అనవసర ఆరోపణల్ని అస్సలెవ్వరూ పట్టించుకోవడం లేదు.
తాజాగా శ్రీరెడ్డి ఇదే విషయమై కొందరు మహిళా సంఘాల ప్రతినిధులతో కలసి మహిళా కమీషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇంతటితో తన పోరాటం ఆగదనీ, మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు జాతీయ స్థాయిలో కూడా పోరాడతానని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.