స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తొలి రోజు నుండే మిక్స్డ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్ర ప్రదర్శన అంతంతమాత్రంగా మారింది.
ఇదే సమయంలో విడుదలైన మహానటి చిత్రం మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని రోజురోజుకి స్క్రీన్స్ సంఖ్య పెంచుకుంటూ పోతున్నది. దీని కారణంగా బన్నీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం ప్రదర్శితమవుతున్న స్క్రీన్స్ అన్ని మహానటికి మారిపోతున్నాయి.
దీనితో అల్లు అర్జున్ కి ఇప్పుడు మహానటి రూపంలో ఒక షాక్ తగిలినట్టయింది. ఎందుకంటే- సాధారణంగా సమ్మర్ సీజన్ లో సినిమా యావరేజ్ గా ఉన్నా సరే ప్రేక్షకుల నుండి కలెక్షన్స్ వస్తుంటాయి అలాంటిది ఇప్పుడు మరో మంచి చిత్రం రావడంతో ఈ సినిమా కలెక్షన్స్ పైన పెద్ద ప్రభావం వచ్చి పడింది.
మొత్తానికి మహానటి ఎందరికో తీపి గుర్తుని మిగిలిస్తే బన్నీ కి మాత్రం పెద్ద షాక్ ఇచ్చింది.