ఖైది నెం.150, సైరా.. ఇవి రెండూ చిరంజీవి సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కిన సినిమాలు. రామ్చరణ్ వీటికి నిర్మాతగా వ్యవహరించాడు. అయితే... చిరంజీవి పారితోషికం మాత్రం చెల్లించేశాడట చరణ్. ఖైది నెం.150కి గానూ చిరంజీవికి 30 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తోంది. `సైరా`కు 45 కోట్లు చెల్లించాడట. ఇప్పుడు కొరటాల శివతో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. దానికి 50 కోట్ల పారితోషికం అందించనున్నాడని తెలుస్తోంది.
సొంత నిర్మాణ సంస్థ అయినా సరే, ఐటీ లెక్కల కోసం ఎవరికి ఎంత చెల్లించారో రాసుకోవడం అత్యవసరం. ఆ లెక్కల్ని బట్టి చిరంజీవి పారితోషికం ఎంతో తెలిసింది. అన్నట్టు చిరు 152వ చిత్రానికి చరణ్ తో పాటు మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో పాలు పంచుకుంది. అంటే... చిరు పారితోషికాన్ని మాట్నీ ఎంటర్టైన్మెంట్ కూడా భరించాల్సి ఉంటుందన్నమాట. ఈ సినిమాకి గానూ కొరటాల శివకు ఏకంగా 20 కోట్లు చెల్లించారని సమాచారం.