'రాజుగారి గది 3' ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి థియేట్రికల్ రైట్స్ చాలా తక్కువ రేటుకే అమ్ముడుపోయాయి. అక్షరాలా మూడున్నర కోట్లు అని తెలుస్తోంది. ఇలా చూస్తే, ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టినట్లే. ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఇదే రోజు మరో చెప్పుకోదగ్గ సినిమా లేకపోవడం 'రాజుగారి గది 3'కి బాగా కలిసొచ్చింది. ఫస్ట్‌డే కొన్ని చోట్ల డీలా పడినా ఓవరాల్‌గా వీకెండ్ నెట్టుకొచ్చేసింది. దాంతో దర్శకుడు, నిర్మాత అయిన ఓంకార్ సేఫ్ జోన్‌లోకి వచ్చేసినట్లే.
అంతేకాదు, ఈ సినిమాతో హీరోయిన్ అవికా గోర్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమెకి కూడా ఈ అంశం కలిసొచ్చినట్లే. ఈ సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాల్లో మొదటిది సూపర్ హిట్ అవగా, రెండోది ఫర్వాలేదనిపించింది. మూడో సినిమాతోనూ ఓంకార్ గట్టెక్కేశాడని తెలుస్తోంది. ఇక ఈ సిరీస్‌లో సినిమాలు వస్తూనే ఉంటాయని చెప్పిన ఓంకార్, తదుపరి సిరీస్‌ని సీనియర్ హీరో వెంకటేష్‌తో తెరకెక్కించాలనుకుంటున్నానని చెప్పారు. అయితే, నాగార్జునతో తెరకెక్కించిన 'రాజుగారి గది 2'తో చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. పెద్ద హీరోలతో చేతులు కలిపి మళ్లీ చేతులు కాల్చుకుంటాడా.? లేక తమ్ముడితోనే సరిపెట్టి, ఓకే అనిపించుకుంటాడా.? చూడాలి మరి. ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే.