మెగా అల్లుడు కళ్యాణ్ తెరంగేట్రానికి సర్వ సిద్ధమైంది. దీనికి సంబందించిన ప్రకటన కూడా వెలువడింది.
అయితే కళ్యాణ్ నటనలో మెళుకువాలు నేర్చింది ఎక్కడో తెలుసా? ఆయన మరెవరో కాదు ‘స్టార్ గురు’- సత్యానంద్. ఇక సత్యానంద్ పేరు అందరికి సుపరిచితమే, పవన్ కళ్యాణ్ నుండి మొదలుకుని ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి ఎందరో స్టార్ హీరోలకి నటనలో ఓనమాలు నేర్పిన గురువు ఆయన.
ఇక మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ తరం హీరోలు అందరు ఆయన వద్ద శిష్యరికం చేసినవారే అవ్వడం గమనార్హం. ఇప్పుడు మెగా అల్లుడు కూడా ఆయన శిష్యుడే అవ్వడం ఆసక్తి రేపే అంశం.
మరి పైన స్టార్ హీరోల వలె ఈయన కూడా మంచి హీరో అవ్వాలని కోరుకుందాం..