'సైరా' లీకులు షురూ అయ్యాయిరా!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్‌ ఆగిపోయిందనే ప్రచారం జరుగుతున్నా, 'అదేం లేదు, షూటింగ్‌ ఆగిపోవడమన్న సమస్యే లేదు' అనే క్లారిటీ సినిమా యూనిట్‌ నుంచి బయటకొస్తోంది. ఈ అనుమానాలు ఇలా వుంటే, లేటెస్ట్‌గా 'సైరా' షూటింగ్‌ స్పాట్‌కి సంబంధించిన కొన్ని స్టిల్స్‌ లీక్‌ అయ్యాయి. అయితే ఈ స్టిల్స్‌ తాజా స్టిల్స్‌ అనుకోవాలా? ఫస్ట్‌ షెడ్యూల్‌లోనివని అనుకోవాలా? అనేదే ఎవరికీ అర్థం కావడంలేదు. 

షూటింగ్‌ స్పాట్‌లో కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినాసరే, స్టిల్స్‌ బయటకు రావడం పట్ల 'సైరా నరసింహారెడ్డి' టీమ్‌ ఆందోళన చెందుతోంది. చారిత్రక నేపథ్యమున్న సినిమా కావడంతో, చాలా జాగ్రత్తగా ప్రతి అంశాన్నీ డీల్‌ చేయాల్సి వుంటుంది. ఈ క్రమంలో ఏ చిన్న స్టిల్‌ బయటకు వచ్చినా, దాని చుట్టూ మళ్ళీ కొత్త రచ్చ షురూ అవ్వొచ్చు. కేవలం స్టిల్స్‌ మాత్రమే బయటకు వచ్చాయా? వీడియో ఏమన్నా బయటకు వచ్చిందా? అని 'సైరా నరసింహారెడ్డి' టీమ్‌ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. 

షూటింగ్‌ స్పాట్‌కి ఎవరూ ఎలాంటి ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ తీసుకురాకుండా మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని దర్శకుడు సురేందర్‌రెడ్డి, నిర్మాత రామ్‌చరణ్‌, హీరో మెగాస్టార్‌ చిరంజీవి యూనిట్‌ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారట. ఎన్ని చేసినా, షూటింగ్‌ స్పాట్‌ నుంచి స్టిల్స్‌ లీక్‌ అవడాన్ని ఆపలేరన్న విషయం పలు ప్రెస్టీజియస్‌ మూవీస్‌ విషయంలో జరిగింది. షూటింగ్‌ స్పాట్‌లో ఎంత కష్టపడ్డా సరే ఒక్కోసారి ఎడిటింగ్‌ టేబుల్‌ నుంచి ఫుల్‌ సీన్స్‌ విడుదలయిపోతున్న సంగతి తెల్సిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS