సూపర్ స్టార్ రజినీకాంత్ కాలా చిత్రానికి సంబందించిన ధియేట్రికల్ & శాటీలైట్ రైట్స్ కి మంచి ధర పలికింది.
అందుతున్న వివరాల ప్రకారం, ధియేట్రికల్ రైట్స్ క్రింద రూ 125కోట్లకు అమ్ముడవగా తాజాగా శాటీలైట్ రైట్స్ ని ప్రముఖ ఛానల్ స్టార్ మా రూ 75కోట్లకి దక్కించుకుంది. ఈ బిజినెస్ చూస్తే అర్ధమయ్యేది ఏంటంటే, సూపర్ స్టార్ సినిమా కాలాకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ అనన్య సామాన్యం అని...
ఇక ఈ సినిమా రాకతో తెలుగు చిత్రాలైన భరత్ అనే నేను & నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాలు తమ తమ విడుదల తేదీలు మార్చేసుకున్నాయి. దీన్నిబట్టి తెలుగులో సూపర్ స్టార్ స్టామినా ఇట్టే తెలిసిపోతుంది.
మొత్తానికి రజినీకాంత్ కాలా విడుదలకి ముందే ఇంతటి సంచలనాలు నమోదు చేస్తుంటే ఇక విడుదల అయ్యాక ఎటువంటి రికార్డులు సృష్టించనుందో..