చిరు152, ప్రభాస్20 మరియు PSPK26... మెగా స్టార్, రెబెల్ స్టార్ మరియు పవర్ స్టార్ ఇలా ముగ్గురు అగ్ర తారలకు సంబంధించి ప్రస్తుతం వాడుకలో ఉన్న టైటిల్స్ ఇవి. వీటి ఫస్ట్ లుక్స్ మరియు టైటిల్స్ కోసం ఈ హీరోల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మెగా స్టార్ 'చిరంజీవి' 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతుంది ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి, ఈ చిత్రం లో చిరు ద్విపాత్రాభినయం చేయనున్నారని, అంతేకాకుండా మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' కూడా ఈ చిత్రం లో ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్టు వార్తలొచ్చాయి. తాజాగా మరో సారి ఈ చిత్రానికి సంబంధించిన వార్త ఒకటి ఫిలిం వర్గాల్లో చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ చిత్రం యొక్క టైటిల్.. ఈ చిత్రానికి 'ఆచార్య' అనే టైటిల్ ఖరారైనట్టు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది.
మరోపక్క లీకైన ఫోటోలతో తో సోషల్ మీడియాను షేక్ చేసిన పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' రీ-ఎంట్రీ చిత్రం #PSPK26 కు సంబంధించి నిర్మాతలు 'వకీల్ సాబ్' అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట. ఇంకో పక్క రెబెల్ స్టార్ 'ప్రభాస్' తదుపరి చిత్రానికి 'జాన్' అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు మొదటి నుంచి ప్రచారం జరిగింది, కానీ తాజాగా ఈ చిత్ర నిర్మాతలు 'ఓ డియర్' 'రాధే శ్యామ్' అను టైటిల్స్ ను రిజిస్టర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ ఈ టైటిల్స్ ఈ చిత్రాలకు సంబంధించినవేనా లేదా ఆ నిర్మాతలు వేరే చిత్రాల కోసం రిజిస్టర్ చేయించారా అన్నది తెలియాలంటే.. చిత్ర యూనిట్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే.