గత ఎన్నికలలో వైకాపాకి మద్దతు తెలిపారు అలీ. రాజమండ్రి నుంచి ఆయన పోటీ చేద్దామనుకున్నారు. కానీ... ఆ స్థానం అలీకి కేటాయించడం కుదర్లేదు. అయితే అప్పుడే.. `నిన్ను రాజ్య సభకు పంపిస్తాం` అని జగన్ మాట ఇచ్చినట్టు టాక్. ఇప్పుడు అదే నిజం అవుతోంది. త్వరలో వైకాపా తరపున... అలీ రాజ్యసభకు వెళ్లడం గ్యారెంటీ అని సినీ, రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.
వచ్చేనెలలో.. అలీ రాజ్యసభ్య ఎంట్రీకి ముహూర్తం కుదిరినట్టు సమాచారం అందుతోంది. గురువారం సినీ ప్రముఖులు సీఎంతో భేటీ వేసిన సంగతి తెలిసిందే. ఆ బృందంలో అలీ కూడా కనిపించారు. జగన్ ఆహ్వానంతోనే... అలీ అక్కడకు వెళ్లారని, ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని రాజ్యసభ సీటు గురించి ప్రస్తావించారని సమాచారం అందుతోంది. అప్పట్లో అలీ.. జనసేన తరపున ప్రచారం చేస్తారని అనుకున్నారు. ఎందుకంటే పవన్ కల్యాణ్‌కి అలీ అత్యంత సన్నిహితుడు. కానీ.. పవన్ కి వ్యతిరేకంగా గళం వినిపించి, పవన్ అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పట్లో అలీని పవన్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేశారు. ఆ సమయంలోనే... అలీ కి రాజ్యసభ సీటు ఎర వేశారని, అందుకే వైకాపాలో చేరాడని ప్రచారం జరిగింది.ఇప్పుడు అదే నిజమైంది.