వైసీపీలో చేరనున్న ఆలీ.!

మరిన్ని వార్తలు

పవన్‌ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితులు ఎవరు అంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు కమెడియన్‌ ఆలీ. ఆలీ చెబితే పవన్‌ కళ్యాణ్‌ కాదనడు అనే అభిప్రాయం చాలా మందికి ఉంది. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఆలీని ఎంత అభిమానిస్తారో అందరికీ తెలుసు. ఆలీ జనసేన పార్టీ తరపున పోటీ చేయబోతున్నాడంటూ కొన్నాళ్ల క్రితం ప్రచారం జరిగింది. అయితే ఆలీ తాజాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుండి ఆలీ పోటీ చేయబోతున్నారు కూడా. 

 

ఇటీవలే జగన్‌ని ఆలీ కలిసి రాజకీయాలపై చర్చించారు. వైఎస్సార్‌సీపీలో చేరాలనుకుంటున్నట్లు జగన్‌కి చెప్పారు. జగన్‌ కూడా ఆలీని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ప్రజా సంకల్పయాత్రలో బిజీగా ఉన్న జగన్‌ యాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో ఆలీని పార్టీలోకి తీసుకోబోతున్నారట. ఆలీ సొంతూరు రాజమండ్రి. గతంలో ఆయన తెలుగు దేశం పార్టీకి సన్నిహితంగా ఉండేవారు. 

 

2014 ఎన్నికల్లోనే రాజమండ్రి నుండి ఆలీ పోటీ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. ఈసారి అదే రాజమండ్రి నుండి వైఎస్సార్‌సీపీ తరపున ఆలీ పోటీ చేస్తారనీ సమాచారమ్‌. అయితే వైఎస్సార్‌సీపీలో చేరాక, పార్టీ సిద్ధాంతాల మేరకు ఆలీ పవన్‌ కళ్యాణ్‌ని విమర్శించక తప్పదా.? విమర్శించాల్సి వస్తే అప్పటిదాకా ఆలీని అభిమానించిన పవన్‌ కళ్యాన్‌ అభిమానుల స్పందన ఎలా ఉంటుంది చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS