బాలయ్య నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్‌కి సంబంధించి, లేటెస్టుగా ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఈ సినిమాలో స్వర్గీయ నందమూరి తారక రామారావు పాత్రలో బాలయ్య నటిస్తుండగా, బాలకృష్ణ పాత్రలో ఆయన తనయడు మోక్షజ్ఞ కనిపించనున్నాడని అభిమానులు భావిస్తున్నారు. మొదట్లో యంగ్ హీరోస్‌లో ఎవరో ఒకర్ని ఈ పాత్ర కోసం ఎంచుకుంటారని ప్రచారం జరిగింది.
కానీ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ద్వారానే నందమూరి వారసుడి ఎంట్రీ ఉండబోతోందని ఊహాగానాలు వినిపించాయి. అసలు బాలయ్య పాత్రే లేదని తాజాగా కళ్యాణ్‌రామ్ క్లారిటీ ఇచ్చేశాడు. ఎన్టీఆర్ కుమారుడు, చైతన్య రధ సారధి అయిన హరికృష్ణ పాత్రను కళ్యాణ్‌రామ్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ న్యూస్‌తో మోక్షజ్ఞ ఎంట్రీపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఇప్పట్లో మోక్షజ్ఞ ఎంట్రీ అయితే లేదని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు.
ఇదిలా ఉంటే, లేటెస్టుగా విడుదలైన పోస్టర్‌లో ఎన్టీఆర్, బసవతారకం ఒళ్లో ఓ పసి పిల్లాడితో కనిపించారు. ఆ పిల్లాడు బాలకృష్ణే. అయితే చిన్నప్పటి బాలకృష్ణ పాత్ర సినిమాలో ఉంది కానీ, పెద్దయ్యాక ఆ బాలకృష్ణ పాత్ర లేదట. అయితే బాలకృష్ణ పాత్ర ఎందుకు లేదు అనే విషయమై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. హరికృష్ణ పాత్ర ఉంది. చంద్రబాబు పాత్ర ఉంది. చంద్రబాబు తోడళ్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర ఉంది. అయితే బాలయ్య పాత్ర ఎందుకు లేదో చూడాలి మరి.