కమెడియన్‌ కొత్త అవతారం: నటనోత్తేజం.!

మరిన్ని వార్తలు

నటుడిగా ఉత్తేజ్‌ సుపరిచితుడు. పలు సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించాడు. కమెడియన్‌గా తనదైన శైలి కామెడీతో ఆకట్టుకున్నాడు. హీరో పక్కన సపోర్టింగ్‌ రోల్స్‌లో అవసరమైన చోట ఎమోషన్స్‌ కూడా పండించాడు. అయితే ఈ మధ్య ఉత్తేజ్‌ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. నటనతో పాటు, మల్టీ టాలెంటెడ్‌ కూడా మనోడు. సో నటనకు దూరమైనా ఇతరత్రా వ్యాపకాల్లో కాన్‌సన్‌ట్రేషన్‌ చేసినట్లు తెలుస్తోంది. 

 

అందులో భాగంగా ఓ యాక్టింగ్‌ స్కూల్‌ని స్టార్ట్‌ చేశాడు ఉత్తేజ్‌. 'మయూఖ టాకీస్‌' పేరుతో ఈ యాక్టింగ్‌ స్కూల్‌ని రన్‌ చేయబోతున్నాడు ఉత్తేజ్‌. ఈ స్కూల్‌ ద్వారా కొత్తగా నటనపై ఆశక్తి కనబరిచే వారికి యాక్టింగ్‌ పాఠాలు చెప్పబోతున్నాడు . అంతేకాదు, డైరెక్షన్‌ విభాగంలో కూడా అవగాహన ఉంది ఉత్తేజ్‌కి. కెరీర్‌ మొదట్లోనే రామ్‌గోపాల్‌ వర్మ దగ్గర అసిస్టెంట్స్‌గా పని చేశారు ఉత్తేజ్‌. 

 

ఉత్తేజ్‌, కృష్ణవంశీ తదితరులు అప్పట్లో ఓ బ్యాచ్‌గా ఉండేవారు. కృష్ణవంశీ తెరకెక్కించిన కొన్ని సినిమాలకు డైలాగ్స్‌ కూడా రాశారు ఉత్తేజ్‌. ఇలా ఇన్ని రకాల విభాగాల్లో పని చేసిన ఉత్తేజ్‌ తనయ చేతన కూడా హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. చేతన హీరోయిన్‌గా ఓ సినిమాలో నటించింది. కానీ తండ్రిలా పేరు తెచ్చుకోలేకపోయింది. తర్వాత మరో సినిమాలో చేసినట్లు కూడా సమాచారమ్‌ లేదు.  


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS