బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకరైన ఆమిర్ ఖాన్ తరచూ ఏదొ ఒక వివాదాల్లో భాగామవుతునే ఉంటాడు.
గత ఏడాది ఈ దేశంలో అసహనం ఎక్కువైంది, దేశం విడిచి వెళ్ళాలని ఉంది అనే భావంతో చెప్పిన మాటలు అప్పట్లో పెను సంచలనమే రేపాయి.ఇక తాజాగా ఆయన తన కూతురితో దిగిన ఒక ఫోటోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
ఇప్పుడు ఈ ఫోటో గురించిన చర్చ సోషల్ మీడియాలో నడుస్తున్నది. వయసులో ఉన్న కూతురితో ఎలా ఉండాలో కూడా తెలియని వాడు సూపర్ స్టార్ అవుతాడా అని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొంతమంది మాత్రం పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి పనులు చేయడమేంటి అని ప్రశ్నిస్తున్నారు.
దీనితో మరోసారి ఆమిర్ ఖాన్ పేరు పతాక శీర్షికలెక్కింది, మరి దీనిపైన సూపర్ స్టార్ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ తగ్స్ అఫ్ హిందూస్తాన్ అనే చిత్రంలో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటిస్తున్నాడు.