ధనుష్ - ఐశ్వర్యలు విడిపోవడం అందరికీ షాక్ కలిగించే విషయమే. వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందన్న సంగతే బయటకు రాకుండా మేనేజ్ చేశారు. రెండు నెలల క్రితం వరకూ అంతా బాగానే ఉందని, సడన్ గా వీరిద్దరి మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని అంతా అంటున్నారు. అయితే.. ఇద్దరి మధ్య గొడవ కొన్నేళ్ల క్రితమే మొదలైపోయిందట. సుచీ లీక్స్ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచీ ధనుష్ - ఐశ్వర్యల మధ్య అడ్డుగోడ మొదలైందని టాక్.
సుచీలీక్స్ వ్యవహారం తెలిసిందే కదా? సుచిత్ర అనే గాయని అప్పట్లో ఎపిసోడ్ల వారీగా స్టార్స్ జీవితాలు, వాళ్ల రాసలీలల గురించి బయటపెట్టింది. అందులో ధనుష్ పేరు కూడా ఉంది. ధనుష్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, అందుకు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని అప్పట్లో సుచిత్ర ప్రకటించి సంచలనం రేకెత్తించింది. ఆ సమయంలో అటు ధనుష్ గానీ, ఇటు ఐశ్వర్య గానీ ఈ విషయమై స్పందించలేదు. కానీ... ఈ జంట మధ్య మంట మాత్రం రేగిపోయింది. ఆ ఎఫెక్ట్ విడాకుల వరకూ తీసుకొచ్చిందని టాక్. మరోవైపు.. ధనుష్ తో ఓ కథానాయిక ఈమధ్య అత్యంత సన్నిహితంగా ఉంటోందని, అది కూడా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడానికి ఓ కారణమని టాక్. ఏదైతేనేం... ఓ స్టార్ జంట వైవాహిక జీవితానికి తెర పడిపోయింది.