దర్శకులు పంథా మార్చారు. పారితోషికం కాదు.. సినిమాల్లో వాటా కావాలంటున్నారు. దానికి నిర్మాతలు కూడా సై అంటున్నారు. త్రివిక్రమ్ పారితోషికం బదులుగా సినిమాలో వాటానే తీసుకొంటున్నాడని సమాచారం. బాహుబలి లాభాల్లో రాజమౌళికి వాటా ఉందని, అదే ఆయన పారితోషికం అని తెలుస్తోంది. ఇప్పుడు శ్రీనువైట్ల కూడా ఇదే దారిలో వెళ్తున్నాడట. తాజాగా ఆయన్నుంచి వస్తున్న సినిమా మిస్టర్. ఈ సినిమా కోసం శ్రీను ఎలాంటి పారితోషికం తీసుకోలేదని, సినిమా హిట్టయిన తరవాత లాభాల్లో వాటా ఇమ్మన్నాడని సమాచారం. శ్రీనువైట్ల కెరీర్ చాలా డల్‌గా నడుస్తోంది. ఆగడుతో.. ఆయన ఇమేజ్ పూర్తిగా డామేజ్ అయ్యింది. బ్రూస్లీ కూడా సరిగా ఆడలేదు. అందుకే.. మళ్లీ ఫామ్‌లోకి రావడానికి, నిర్మాతల దృష్టిని తన వైపుకి తిప్పుకోవడానికి ఈ బంపర్ ఆఫర్ ఇచ్చాడట. మిస్టర్ తరవాత కూడా ఇదే కంటిన్యూ చేస్తాడా, లేదంటే.. స్కీమ్ మారుస్తాడా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాలి.