'దేవదాస్‌' ఫస్ట్‌ పెగ్‌ రేపే.!

By iQlikMovies - August 23, 2018 - 18:13 PM IST

మరిన్ని వార్తలు

నాగార్జున, నాని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'దేవదాస్‌'. మొన్నీ మధ్యనే విడుదలైన ఫస్ట్‌లుక్‌కి బెస్ట్‌ రెస్పాన్స్‌ వచ్చింది. వీళ్లకి మత్తు దిగిందా? ఇంకంతే సంగతి అంటూ విడుదల చేశారు ఆ ఫస్ట్‌లుక్‌ని. ఇప్పుడు 'స్మాల్‌ పెగ్‌' అంటూ ఫస్ట్‌ టీజర్‌ని రిలీజ్‌ చేయబోతున్నారు. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్‌ సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ ప్రీ లుక్‌ని రిలీజ్‌ చేసింది. 

ఓ గోడపై చేతిలో గ్లాసుతో నాగార్జున కూర్చొని ఉండగా, కింద స్మాల్‌ పెగ్‌ ప్లీజ్‌ అంటూ నాని అడుగుతున్నట్లుగా ఉంది. మొదట్నుంచీ మందు చుట్టూనే ఈ సినిమా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. టైటిల్‌లోనే ఉంది కదా. 'దేవదాస్‌' అని. దేవదాస్‌ అంటే గుర్తొచ్చేది చేతిలో మందు సీసా. పక్కనే ఓ కుక్క పిల్ల. కుక్క పిల్లని వదిలేశారు కానీ, మందు సీసా వదలట్లేదు. ఫస్ట్‌లుక్‌లో ఫుల్‌గా తాగేసి ఇద్దరూ ఒకే బెడ్‌పై సృృహ లేకుండా పడుకుని ఉన్నారు. ఇప్పుడేమో 'చీర్స్‌' అంటూ మందు కొట్టేందుకు గెట్‌ రెడీ అంటున్నారు. 

శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. లక్కీగాళ్‌ రష్మికా మండన్నా నానికి జంటగా నటిస్తుండగా, 'మళ్లీ రావా' ఫేం ఆకాంక్షసింగ్‌ నాగార్జునతో జోడీ కడుతోంది. నాగార్జున ఓ పవర్‌ఫుల్‌ డాన్‌ పాత్రలోనూ, నాని డాక్టరు పాత్రలోనూ కనిపించనున్నారు. 

ఫుల్‌ టైం ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS