రవితేజ తాజా చిత్రం "ధమాకా". పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజకు జోడిగా శ్రీలీల సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన 'జింతాక్' పాట మాస్ ని ఆకట్టుకుంది. ఇప్పుడు మరో అదిరిపోయే మాస్ పాట వచ్చింది.'మాస్ రాజా' అంటూ వచ్చిన ఈ పాట మాస్ కి క్యాచిగా వుంది.
భీమ్స్ సిసిరోలియో మాంచి డ్యాన్స్ నెంబర్ ని ఇచ్చారు. రామ జోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ కూడా మాసీగా వున్నాయి. 'బడా ఎంటర్ టైన్మెంట్ వాలా ఆగయా .. బిసి సెంటర్లో మోగాలి తాలియా .. బాడీ లోకల్ .. మైండే గ్లోబల్.. క్లాసు మాసు కాంబో మోడల్ '' ఇలా రవితేజ ఇమేజ్ కి తగ్గట్టు అలరించాయి. రామారావు ఆన్ డ్యూటీతో నిరాశ పరిచాడు రవితేజ. ఇప్పుడు ధమాకా నుండి వస్తున్నా కంటెంట్ మాత్రం సినిమాపై పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తోంది.