తమిళంలో స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు మెగా ఫోన్ పట్టబోతున్నాడు. తన డైరెక్షన్‌లో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా టైటిల్ 'పవర్ పాండి'. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న మూవీ. తాజాగా ట్రైలర్ విడుదలయ్యింది. ఈ ట్రైలర్‌కి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ధనుష్ చేసిన అటెంప్ట్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు తమిళ తంబీలు. ఈ సినిమాలో రాజ్ కిరణ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈయనకి ఓ కొడుకు, మనవడు ఉంటారు. కానీ భార్య ఉండదు. సీనియర్ నటి రేవతికి ఓ బలమైన కారణంగా భర్త దూరమవుతాడు. ఈ ఇద్దరి మధ్యా రిలేషన్.. అది బ్యాడ్ రిలేషన్ కాదు. చాలా పవిత్రమైన బంధం. అసలు ఆ రిలేషన్ ఏంటి? ఆ రిలేషన్ మనసును హత్తుకునే విధంగా ఉంటుందట. సున్నితమైన భావోద్వేగాలతో తెరకెక్కుతోంది ఈ చిత్రం. సీనియర్ నటీనటులతో ఈ కథని ధనుష్ ఎలా డీల్ చేశాడన్నది సినిమా చూస్తే కానీ తెలీదు. అసలు ధనుష్ తలచుకుంటే ఓ మాంచి మసాలా చిత్రాన్ని తెరకెక్కించొచ్చు. కమర్షియల్ వేల్యూస్ అన్నీ తెలిసిన ఓ హీరోగా మాస్ పల్స్‌ని ఎలా పట్టుకోవాలో ధనుష్‌కి తెలుసు. అలాంటిది ఈ టప్ సబ్జెక్ట్‌ని ధనుష్ ఎందుకు టేకప్ చేశాడో కానీ, మంచి ప్రయత్నం చేశాడంటున్నారు సినీ జనం. హీరోగా బిజీగా ఉంటూనే మరో పక్క డైరెక్షన్ ఫీల్డ్‌ని కూడా టచ్ చేశాడు ధనుష్. డైరెక్టర్‌గా కూడా ధనుష్ విజయం సాధించాలని ఆశిద్దాం.