నాగార్జునతో ధనుష్‌ - అందుకేనా?

మరిన్ని వార్తలు

తమిళ హీరో ధనుష్‌ దృష్టి ఇప్పుడు టాలీవుడ్‌పై పడిందంటే అవునంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాణ రంగంలోనూ రాణిస్తూ ఉంటాడు ధనుష్‌. బేసిగ్గా మల్టీ టాలెంటెడ్‌ ఈ యంగ్‌ స్టర్‌. తమిళ్‌ స్టార్‌డమ్‌ ఉన్న ధనుష్‌, హిందీలో కూడా ట్రై చేశాడు. అతని తమిళ సినిమాలు తెలుగులోకి డబ్‌ అవడం మామూలే. అయితే, దర్శకుడిగా టాలీవుడ్‌లో అగ్రహీరోల్లో ఒకరైన నాగార్జునతో ధనుష్‌ ఓ చిత్రం తెరకెక్కించబోతున్నాడట. 

ఇప్పటికే నటుడిగా, నిర్మాతగా ఆకట్టుకున్న ధనుష్‌, ఇటీవల 'పవర్‌ పాండీ' అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమాలో అతను నటించలేదు. ఈసారి తాను నటిస్తూ, దర్శకుడిగా కూడా ఒకే సినిమాతో సత్తా చాటాలనుకుంటున్నాడు. అందుకేనేమో ధనుష్‌, నాగార్జునతో తెరకెక్కించబోయే చిత్రం ఇప్పుడు కోలీవుడ్‌తోపాటు, టాలీవుడ్‌లోనూ హాట్‌ టాపిక్‌ అయ్యింది. తేనాండల్‌ ఫిలిమ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోందట. తమిళ హీరో కార్తి, నాగార్జునతో కలిసి నటించిన 'ఊపిరి' సినిమా తమిళంలో 'తోళా' టైటిల్‌తో విడుదలై అక్కడ మంచి వసూళ్లు రాబట్టింది. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ధనుష్‌, నాగ్‌తో సినిమాని తెరకెక్కించాలనుకుంటున్నాడట. 

ఎప్పటి నుండో టాలీవుడ్‌ స్టార్‌ హీరోతో సినిమా చేయాలని ధనుష్‌ కోరికట. అది ఇప్పటికి సెట్‌ అయ్యిందనుకోవాలి. అయితే ఆ హీరో నాగ్‌ కావడం విశేషమే. ప్రస్తుతం నాగార్జున, రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. మరో పక్క నానితో మల్టీ స్టారర్‌ చేస్తున్నాడు. ఈ తాజా న్యూస్‌ నిజమైతే సీనియర్‌ హీరోల్లో నాగార్జున సో బిజీ అని చెప్పక తప్పదు. మరోపక్క హీరోగా ధనుష్‌ నటించిన 'రఘువరన్‌ బీటెక్‌' సినిమా తెలుగులో కూడా మంచి విజయం అందుకుంది. మామగారైన రజనీకాంత్‌తో ధనుష్‌ నిర్మించిన 'కాలా'చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS