నటి శ్రియా శరణ్ పెళ్ళికి సంబందించిన వార్తలు గత కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి శ్రియాని సైతం మీడియా వారు అడగడం దానికి ఆమె కస్సుబుస్సుమనడం కూడా జరిగిపోయాయి.
అయితే అసలు ఇందులో నిజమెంత అని తెలుసుకునే ప్రయత్నం చేయగా- శ్రియా పెళ్ళి షాపింగ్ చేసింది తనకోసం కాదు తన స్నేహితురాలి కోసమట. అలాగే శ్రియా పెళ్ళి రాజస్తాన్ లో జరగబోతుంది అన్న వార్తలకి కూడా సమాధానం దొరికింది. రాజస్తాన్ లో జరిగేది ఆమె స్నేహితురాలి వివాహామట.
మొత్తానికి శ్రియ స్నేహితురాలి పెళ్ళి కాస్తా శ్రియ పెళ్ళిగా వార్తలు రావడంతో మీడియా మొత్తం శ్రియా వెనకపడడం అలాగే ఆమెకి కాబోయే వాడు రష్యా వాసిగా కూడా కన్ఫర్మ్ చేసి మీడియా తన ఉత్సుకతని మరోసారి నిరూపించుకుంది.
ఏదైతే ఏంటి... శ్రియా శరణ్ పెళ్ళికి ఇంకా సమయం ఉంది..